దయచేసి Online Work ను Full Time గా ఎంచుకోవద్దు.

Friday 25 December 2015

ఇది Money Man హెచ్చరిక : ప్రియులారా! దయచేసి మీరెవరూ మీ స్వంత పనులను మానివేసి Online work ను Full time గా చేసుకోవద్దు. ఏదో మీ Time Pass కోసం చేస్తున్నట్టో లేక Part Time గానో మాత్రమే ఎన్నుకోండి. మీరు దీని యొక్క అవగాహనా పరినితిని పూర్తిగా కలిగిలేరు కాబట్టి ఫుల్ టైమ్ గా ఎంచుకోకపోవడమే నూటికి నూరు పాళ్ళు అంటే 100% మంచిది.
      కేవలం ఆన్లైన్ వర్కునే జీవనాధారంగా చేసుకున్నవారు లేరా? అంటే లక్షల కొద్దీ ఉన్నారు. కానీ వారు ఆ రంగంలో సంపాదించిన జ్ఞానం అమోఘం. దాని వెనుక వారు ఎంతో కృషి, పట్టుదల, తపన కలిగి ఆస్థితికి రాగలిగేరు. మీరు కూడా ఆస్థితికి వెళ్లవచ్చు. దానికి ఎంతో సమయం పడుతుంది. మరి మీరు ఆస్థితికి వచ్చే వరకూ వేరొక ఉపాధి రంగంలో ఉంటే ఈ Online Work రంగంలో మీరు సంతోషంగా ముందుకెళ్లగలరు. మన పనులు మనం చేసుకుంటూ ఖాళీ సమయాన్ని Online Work లో కేటాయించడంలో ఉన్న మజా ఎందులోనూ ఉండదు. ఏ టెన్షన్ కలిగియుండరు. కాబట్టి మీ సమయాన్నంతా దయచేసి వృధా చేసుకోకండి. ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోండి.
    మీకు వీలు కుదిరినప్పుడల్లా వేసే ఒకో రాయి పెద్ద రాళ్ళ గుట్టయి కూర్చుంటుంది. అలాగే మీ ఖాళీ సమయంలో వేసిన మీయొక్క ఒకొక్క సబ్జెక్ట్ ఆన్లైన్ లో .ఒక పెద్ద పుస్తకమి కూర్చుంటుంది. కొన్నాళ్ళకు అదే మీకు నిధులు కురిపించే బంగారపుగని గా మారిపోతుంది.
    అదెలాగో, ఏమి చేయాలో అన్నీ మీకు ఈ సైట్ ద్వారా అర్ధమవుతుంది. మీరు చేయాల్సింది కేవలం దీనిని రెగ్యులర్ గా లేక మీకు వీలు కుదిరినప్పుడు ఫాలో కావడమే! మరింకెందుకాలస్యం పదండి ముందుకు...
 

 

No comments :

Post a Comment

 

Recent Posts

recent comments

Popular Posts

Live Visitors

sakshyam Network Blog's

Followers