Hi Frends Welcome to Money man Blog

Saturday 31 December 2016

ఈ రోజుల్లో అత్యధికంగా స్టూడెంట్స్,గృహిణులు, స్వయం ఉపాధికులు లేక Part Time జాబ్ వర్కర్లు ఆన్ లైన్ లో మనీని ఎలా సంపాదించాలా ? అని వెదుకుతూ వుంటారు. ఎన్నో జాబ్స్ ఉన్నాయని ఎర చూపిస్తున్న కొన్ని మోసకరమైన సంస్థలకు బలవుతూ ఉంటారు. అంతే కాకుండా ఎంతో విలువైన సమయాన్ని, డబ్బును వృధాగా ఖర్చు చేసేస్తారు. దీని కారణంగా సహనం కోల్పోయి ఆన్ లైన్ మనీ సంపాదన అనేది అంతా ట్రాష్, మోసం అనే అభిప్రాయానికి వచ్చేస్తారు!
    నిజానికి వారు తీసుకునే అభిప్రాయం కరెక్టేనా? అంటే ఎంతమాత్రం కరెక్ట్ కాదనేదే Money Man అభిప్రాయం.
    కంప్యూటర్ ముందు కూర్చుని మీరు యాడ్స్ ను క్లిక్ చేయడం, ఈమెయిల్స్ చదవడం చేస్తే మనీ రాదు. దీని వలన ఇంటర్ నెట్ బిల్లు, మీ సమయం వేస్ట్ అవుతాయి తప్ప మరో ప్రయోజనం లేదు. ఈ విధంగా మోసం చేయడానికి ఎన్నో సంస్థలు ఆన్ లైన్ లో రెడీగా ఉన్నాయి. Neobux లాంటి నమ్మకమైన సైట్స్ కొన్ని ఆన్లైన్ లో ఉన్నా అవిచ్చే డబ్బులు ఆరోజు దాని పనికి ఖర్చయ్యే మీ కరెంట్ బిల్లుకు కూడా సరిపోవు.
    మరి!..ఆన్ లైన్ లో సంపాదన ఎలా సాధ్యం?
    మీరు ఆన్లైన్ లో గ్యారెంటీగా సంపాదించవచ్చు. ఎలాగని అడుగుతారా? లేక మాలో ఏముండాలి? అని అడుగుతారా? అంటే రెండవ ప్రశ్నకు ఆన్సర్ మీవద్ద ఉంటేనే సాధ్యం అవుతుంది. అదేమిటంటే మీలో స్కిల్స్ ఉండాలి. కొత్తగా ఏదైనా చేయాలన్న తపన ఉండాలి. ఏదైనా సృష్టించ గల టాలెంట్ మీవద్ద పుష్కలంగా ఉండాలి. ఇవి ఉంటేనే ఆన్ లైన్ లో మనీ సంపాదన సాధ్యపడుతుంది.
    మీరు సిన్సియర్ గా,సీరియస్ గా సహనంగా వర్కు చేయాలే గాని ఈక్రింది అన్నీ సంస్థల నుండి మీరు ఈజీగానే డబ్బు సంపాదించవచ్చు.
* ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలు * సోషల్ మీడియా సంస్థలు * గూగుల్ ప్రొడక్ట్స్ * బ్లాగులు * వెబ్ సైట్లు ...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మార్గాలు మీకోసం రెడీగా ఉన్నాయి. వాటన్నిటి ద్వారా మీరు చక్కని సంపాదన ఏర్పరచుకోవచ్చు.
     మీరు చేయాల్సిందల్లా ఈ బ్లాగును రెగ్యులర్ గా ఫాలో కావడమే! ఈ Money Man ఆన్ లైన్ లో జల్లెడ వేసి వడబోసి నమ్మకమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది.మీకు కావల్సిన అన్నీ విషయాలను తెలియజేసి, మీ సమస్యలను పూర్తిగా నివారించి మిమ్మల్ని నిజమైన ఆన్ లైన్ సంపాదనా పరులుగా నిలబెడుతుంది. మరి ముందుకు సాగుదామా?

గమనిక : ఈ బ్లాగు English లో లభిస్తుంది.

No comments :

Post a Comment

 

Recent Posts

recent comments

Popular Posts

Live Visitors

sakshyam Network Blog's

Followers