
కేవలం ఆన్లైన్ వర్కునే జీవనాధారంగా చేసుకున్నవారు లేరా? అంటే లక్షల కొద్దీ ఉన్నారు. కానీ వారు ఆ రంగంలో సంపాదించిన జ్ఞానం అమోఘం. దాని వెనుక వారు ఎంతో కృషి, పట్టుదల, తపన కలిగి ఆస్థితికి రాగలిగేరు. మీరు కూడా ఆస్థితికి వెళ్లవచ్చు. దానికి ఎంతో సమయం పడుతుంది. మరి మీరు ఆస్థితికి వచ్చే వరకూ వేరొక ఉపాధి రంగంలో ఉంటే ఈ Online Work రంగంలో మీరు సంతోషంగా ముందుకెళ్లగలరు. మన పనులు మనం చేసుకుంటూ ఖాళీ సమయాన్ని Online Work లో కేటాయించడంలో ఉన్న మజా ఎందులోనూ ఉండదు. ఏ టెన్షన్ కలిగియుండరు. కాబట్టి మీ సమయాన్నంతా దయచేసి వృధా చేసుకోకండి. ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోండి.
మీకు వీలు కుదిరినప్పుడల్లా వేసే ఒకో రాయి పెద్ద రాళ్ళ గుట్టయి కూర్చుంటుంది. అలాగే మీ ఖాళీ సమయంలో వేసిన మీయొక్క ఒకొక్క సబ్జెక్ట్ ఆన్లైన్ లో .ఒక పెద్ద పుస్తకమి కూర్చుంటుంది. కొన్నాళ్ళకు అదే మీకు నిధులు కురిపించే బంగారపుగని గా మారిపోతుంది.
No comments :
Post a Comment